SRCL: సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరుగుతున్న రైతు మహోత్సవానికి ముస్తాబాద్ మండలం చీకోడ్ రైతులు తరలివెళ్లారు. ఆధునిక యంత్రాలు, నూతన వంగడాలు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాల ప్రదర్శన, పంట సాగు పద్ధతులపై అవగాహన, వ్యవసాయ ఉత్పత్తులు, భూసార పరీక్షలు, సేంద్రియ పద్ధతులు వంటి 150 రకాల స్టాళ్లను సందర్శించి అవగాహన పెంచుకోనున్నట్లు రైతులు తెలిపారు.