»Acb Raids In Banjara Hills Police Station By The Usual Threat Of Police To Pubs
ACB raids: పబ్ లకు పోలీసుల మాముళ్ల బెదిరింపు..షాకిచ్చిన ఏసీబీ
మాముళ్ల కోసం ఎవరైనా వస్తే అండగా ఉండాల్సిన పోలీసులే మాముళ్లు వసూలు చేయడం ప్రారంభించారు. అది కూడా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బంజారాహిల్స్ పోలీసులు ఇలా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భాధితుని ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
ACB raids in banjara hills police station by the usual threat of police to pubs
అక్రమాలు జరిగితే అండగా ఉండాల్సిన పోలీసులే అక్రమాలకు పాల్పడి అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో(banjara hills police station) చోటుచేసుకుంది. మాముళ్ల కోసం పోలీసులు వేధిస్తున్నారని ఓ పబ్ నిర్వహకుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు సోదాలు(ACB raids) నిర్వహించారు. ఆ క్రమంలో బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ ఎం.నరేందర్, సన్ ఇన్స్పెక్టర్ ఎస్.నవీన్ రెడ్డి, హోంగార్డు శ్రీహరిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించి, వారందరిపై కేసులు నమోదు చేసి వారిని విచారించారు. ఈ నేపథ్యంలో వారిపై 41 ఎ సీఆర్పీసీ కింద విచారణ కోసం ఎసీబీ ముందు హాజరు కావాలని నోటీసులు అందించారు.
బంజారాహిల్స్‌లోని రాక్‌క్లబ్ స్కై లాంజ్ మేనేజింగ్ పార్ట్నర్ నీలా రాజేశ్వర్ లక్ష్మణ్‌రావు పబ్ వ్యాపారం నిర్వహిస్తుండగా..తనను మమూలు వసూళ్ల పేరుతో రూ.4.5 లక్షల కోసం వేధిస్తున్నారని ఆరోపిస్తూ బాధితుడు ఫిర్యాదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఫిర్యాదుదారుడు అంత పెద్ద మొత్తం చెల్లించలేకపోవడంతో వారు మూడు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు చెప్పాడు. మరోవైపు హోంగార్డు విడిగా రూ.10వేలు లంచం(bribe) ఇవ్వాలని డిమాండ్ చేశారని పేర్కొన్నాడు.
ఫిర్యాదుదారు డబ్బు ఇవ్వలేకపోవడంతో ఇన్స్పెక్టర్ నరేందర్ పబ్ యజమానిని వేధించడం ప్రారంభించాడు. అక్టోబర్ 1 న హోంగార్డు పబ్‌కు వెళ్లి ఫిర్యాదుదారుని పోలీసు స్టేషన్‌కు రావాలని కోరాడు. అక్కడ వారు అతన్ని చాలా గంటలు అక్రమంగా నిర్బంధించారని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన లక్ష్మణ్‌రావు ఏసీబీని ఆశ్రయించగా నేరారోపణ కింద కేసు నమోదు చేసి వారిపై చర్యలు తీసుకున్నారు. అయితే ఇది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు. ఇలా జరగడం ఇది రెండవ సారి అని బాధితుడు అంటున్నారు. మరోవైపు బంజారాహిల్స్‌లో గతంలో భూ వివాదానికి సంబంధించి మూడు లక్షల రూపాయలు తీసుకున్న క్రమంలో బంజారాహిల్స్ ఎస్ఐ రవీందర్ నాయక్‌ను ఎసిబి అధికారులు(acb officers) అరెస్టు చేశారు. ఇలా పలు ఘటనల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నారు.