ADB: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ సమక్షంలో తిర్యాని మండలానికి చెందిన బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో శనివారం చేరారు. వారికి సుగుణ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు.