యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ 'రూల్స్ రంజన్'. ఏఎం రత్నం సమర్పణలో ఆయన కుమారుడు రత్నం కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా పై కిరణ్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. కానీ సీన్ రివర్స్ అయినట్టే ఉంది వ్యవహారం.
Kiran Abbavaram: బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం.. ఏ మాత్రం గ్యాప్ లేకుండా ఈసారి ‘రూల్స్ రంజన్’గా థియేటర్స్‌లోకి వచ్చేశాడు. ఈ సినిమాలో శ్రేయ ఘోషాల్ పాడిన ‘సమ్మోహనుడా’ సాంగ్ హిట్ అవడంతో.. సినిమా పై మంచి బజ్ ఏర్పడింది. కిరణ్ కూడా భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోను గీత ఆర్ట్స్ 2 బ్యానర్ ఇచ్చిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేయాలనుకున్నాడు. కానీ బాబు మళ్లీ బోల్తా కొట్టేశాడనే రివ్యూస్ సొంతం చేసుకుంది రూల్స్ రంజన్. ఈ సినిమా డివైడ్ టాక్, నెగెటివ్ టాక్ వినిపిస్తోంది. కామెడీ బాగుందని అంటున్నప్పటికీ.. పాత సీసాతో కొత్త సార పోసినట్టుగా ఉందని అంటున్నారు. సోషల్ మీడియా టాక్ ప్రకారం.. రూల్స్ రంజన్, కిరణ్ అబ్బవరంకి ఆశించిన స్థాయి రిజల్ట్ ఇచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయంటున్నారు. దీంతో కిరణ్ అబ్బవరం జాగ్రత్త పడాల్సిన టైమ్ వచ్చేసింది.. నటన మరీ సాదాసీదాగా మారిపోతోంది.. ఈ సినిమాలో మరీ దారుణంగా ఉంది.. ఇలా అయితే కిరణ్ కెరీర్ కష్టంలో పడుతుంది.. అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఫస్ట్ సినిమా రాజావారు రాణిగారుతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కిరణ్.. ఆ తర్వాత SR కళ్యాణమండపం సినిమాతో మరో మంచి హిట్ కొట్టి ఇండస్ట్రీలో తనకంటూ హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆశించిన స్థాయి హిట్స్ ఇవ్వలేదు ఈ యంగ్ హీరో. బ్యాక్ టు బ్యాక్ సినిమాలైతే చేస్తున్నాడు తప్పితే.. హిట్ మాత్రం అందుకోవడం లేదు. కథల విషయంలో కిరణ్ అబ్బవరం క్లారిటీ మిస్ అవుతున్నాడు అనే కామెంట్స్ అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి వినిపిస్తున్నాయి. మరో రెండు ఫ్లాప్స్ పడితే కిరణ్ కెరీర్ క్లోజ్ అంటున్నారు. మరి ఇప్పటికైనా బాబు గారు మంచి సినిమాలు చేస్తాడేమో చూడాలి.