SRPT: గరిడేపల్లి మండలం కీతవారిగూడెం చౌరస్తాలో కారు ఢీకొని రేగులగడ్డ తండా సర్పంచ్ భర్త నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108లో హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.