»Kattappa Holding The Legs Of The Star Heros Father
Kattappa: స్టార్ హీరో తండ్రి కాళ్లు పట్టుకున్న కట్టప్ప..అందుకేనా?
ఇండస్ట్రీలో మనకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకోవాలంటే ఒక్క అవకాశం చాలు. ఒక్క ఛాన్స్‌తో ఇండస్ట్రీలో దుసుకుపోతున్నవాళ్లు చాలామంది ఉన్నారు. అందులో సత్యరాజ్(sathyaraj) ఒకరు. అయితే తన జీవితంలోని కీలక విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అదెంటో ఇప్పుడు చుద్దాం.
kattappa holding the legs of the star hero's father
‘కట్టప్ప(kattappa)’ ఈ పేరు గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే బహుబలి సినిమా ఎంత హిట్ అయ్యిందో అందులోని నటులు అంతకంటే ఎక్కువ పాపులర్ అయ్యారు. హీరో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యక్రిష్ణ వీళ్లతో పాటు కట్టప్ప కూడా క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఈ సినిమాలో కట్టప్ప పాత్రలో సత్యరాజ్ నటించాడు. ప్రస్తుతం ఈ స్టార్ నటుడు వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరో అయిన గతంలో ఒక్క ఛాన్స్ కోసం ఒక స్టార్ హీరో తండ్రి కాళ్లు కూడా పట్టుకున్నాడు అంటా. ఇంతకీ కట్టప్ప ఏ హీరో తండ్రి కాళ్లు పట్టుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.
స్టార్ హీరో అయిన సూర్య తండ్రి శివకుమార్ కాళ్లు పట్టుకుని.. ఒక్క ఛాన్స్ ఇవ్వమని సత్యరాజ్(sathyaraj) బ్రతిమిలాడుకున్నాడని తాజాగా ఓ ఇంటర్వూలో అతనే స్వయంగా తెలిపాడు. శివకుమార్ లేకపోతే సినీ ఇండస్ట్రీలో ఇంతటి సక్సెస్ అందుకునేవాడిని కాదని సత్యరాజ్ చెప్పాడు. కెరీర్ ప్రారంభంలో చిన్న పాత్రలు, విలన్‌గా చేసేవారు. తర్వాత తన నటనతో స్టార్ నటుడిగా ఎదిగాడు సత్యరాజ్. తన సక్సెస్‌కి మొదటికారణం శివకుమార్ అని సత్యరాజ్ వెల్లడించాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు మా కుటుంబానికి వాళ్ల కుటుంబానికి మంచి అనుబంధం కూడా ఉందని సత్యరాజ్ తెలిపారు.