సమర్పణ: సోనాలి నారంగ్ నిర్మాత:సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన రావు కథ, కథనం మాటలు, దర్శకత్వం: హర్షవర్ధన్ విడుదల తేదీ:అక్టోబర్ 6, 2023
Mama Mascheendra Movie Review:సుధీర్ బాబు త్రిపాత్రాభినయం చేసిన మూవీ మామా మశ్చీంద్ర. నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వం వహించిన ఫస్ట్ మూవీ. సుధీర్ బాబుతో ట్రిబుల్ రోల్ చేసిన మూవీ, ఆ లుక్స్ సినిమాకు హైప్ పెంచాయి. మరీ సినిమా ఎలా ఉందంటే..?
కథ ఏంటంటే..?
చిన్న తనంలో జరిగిన కొన్ని ఘటనల వల్ల పరశురామ్ (సుధీర్ బాబు) కఠినంగా తయారవుతాడు. ఆస్తి కోసం సొంత మనుషులను చంపాలని ట్రై చేస్తాడు. చెల్లెలు, ఆమె భర్త, పిల్లలను చంపమని తాను నమ్మిన బంటు దాసు (హర్షవర్ధన్) పంపిస్తాడు. వాళ్లు తప్పించుకుంటారు. చెల్లి కుమారులు (సుధీర్ బాబు డ్యుయల్) పరశురామ్‌ను పోలి ఉంటారు. పరుశురామ్ కూతురుతోపాటు.. దాసు కూతురిని ప్రేమిస్తారు. ప్రేమ విషయం తెలిసి.. తన పోలికలతో జన్మించిన మేనల్లుళ్లు పగ తీర్చుకోవాలని ప్రేమ పేరుతో నాటకం ఆడుతున్నాడని అనుమానిస్తాడు. పరశురామ్ యుక్త వయస్సులో ఉన్నప్పుడు అతని మీద హత్యాయత్నం చేసింది ఎవరు..? కూతుళ్ల విషయంలో పరశురామ్, దాసు ఒకరి వద్ద మరొకరు దాచిన నిజం ఏంటీ..? అనేది మిగతా సినిమా.
ఎలా ఉందంటే..?
మామా మశ్చీంద్ర మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదని క్రిటిక్స్ అంటున్నారు. రొటిన్ మూవీ.. స్టోరీ కూడా అంతగా ఆకట్టుకోలేదు. సినిమాలో వచ్చే ట్విస్టులతో ప్రేక్షకులు గందర గోళానికి గురవుతారు. ఆ ట్విస్ట్‌లు కూడా రొటీనే.. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ట్విస్ట్‌లు ఇస్తూ మూవీని తిప్పేశారు. ఏం జరుగుతుందనే అంశానికి సంబంధించి ప్రేక్షకులు తలపట్టుకునే పరిస్థితి ఉంటుంది. వరసగా షాక్‌లు ఇవ్వడంతో ప్రేక్షకులు నిజంగానే షాక్ తినే పరిస్థితి. హీరోని మూడు డిఫరెంట్ గెటప్స్‌లో చూపించడం.. ట్విస్టులు రాసుకున్నారెమో.. అందుకే అనుకున్నట్టు మూవీ రాలేదు. హర్షవర్ధన్ అంటే కామెడీ ఉంటుంది. మామా మశ్చీంద్రలో అదీ మచ్చుకైన కనిపించదు. ఏవో మూడు, నాలుగు సీన్లు ఉంటాయి. పాటలు, నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకునేలా లేవు. పీజీ విందా కెమెరా పనితనం కూడా అంతగా అట్రాక్ట్ చేయలేదు.
ఎవరెలా చేశారంటే..?
సుధీర్ బాబు మూడు పాత్రల్లో చేశారు. మేనల్లుళ్ల పాత్ర విషయానికి వస్తే.. లడ్డు బాబు మేకప్, లుక్ సెట్ కాలేదు. ముసలి గెటప్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. మరొకరితో డబ్బింగ్ చెప్పించడం సూట్ అవలేదు. హీరోయిన్లు ఈషా రెబ్బా, మృణాళిని రవి పాత్రలు రొటిన్‌గా ఉన్నాయి. రచయితగా, దర్శకుడిగా హర్షవర్ధన్ ప్లాప్ అయ్యారు. నటుడిగా ఫర్లేదు. అంతకుముందు మనం, గుండెజారి గల్లంతయ్యిందే, చిన్నదాన నీ కోసం సినిమాలకు సంభాషణలు రాసింది హర్షవర్ధన్ అనే సందేహాం కలుగుతుంది. రాజీవ్ కనకాల, మిర్చి కిరణ్, హరితేజ, అజయ్, షకలక శంకర్ తమ పరిధి మేరకు నటించారు.
ఫైనల్‌గా
ఓల్డ్ ఏజ్ గెటప్ విషయంలో సుధీర్ బాబు జాగ్రత్తలు తీసుకుంటే బావుండేది. స్టార్టింగ్, ఎండింగ్, మధ్యలో కొన్ని కామెడీ సీన్లు ఫర్లేదు. డైరెక్టర్‌గా హర్షవర్ధన్ ఫెయిల్ అయ్యాడు. మహేశ్ బాబు బావ సుధీర్ ఖాతాలో మరో ప్లాప్ మూవీ వచ్చి చేరిందనే చెప్పాల్సి ఉంటుంది.
ప్లస్ పాయింట్స్
కొన్ని కామెడీ సీన్లు
డీజేగా సుధీర్ నటన
నటుడిగా హర్షవర్ధన్ రోల్
మైనస్ పాయింట్స్
కథ, కథనం, దర్శకత్వం
పరశురామ్, లడ్డు బాబు క్యారెక్టర్స్
మూవీలో అనుకొని ట్విస్టులు
అంతగా ఆకట్టుకొని సంగీతం