మహేష్ బాబు కొత్త సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా.. అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఈ సినిమా కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాడు. కానీ రోజు రోజుకి వెనక్కి వెళ్తున్నట్టు.. ఈ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా.. ఇంకా సెట్స్ పైకి వెళ్లడం లేదు. ముందుగాసెప్టెంబర్ 8 షూటింగ్ ప్రారంభం కానున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్ మరింత ఆలస్యంగా మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫైనల్‌గా సెప్టెంబర్ 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. ఈ షూటింగ్‌ను యాక్షన్ సీక్వెన్స్‌తో మొదలు చేయబోతున్నట్టు టాక్.
ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేయబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాలో మహేష్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే సరికొత్తగా మేకోవర్ అయ్యే పనిలో ఉన్నాడు మహేష్. అతడు, ఖలేజా తర్వాత మహేష్-త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న ఈ హ్యాట్రిక్ మూవీ.. త్రివిక్రమ్ స్టైల్లో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతోంది. ఇందులో మహేష్ సరసన పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. మహర్షి తర్వాత మహేష్, పూజాహెగ్డే రెండోసారి జంటగా నటిస్తున్న సినిమా ఇదే కానుంది. అయితే ఇందులో సెకండ్ హీరోయిన్‌కు ఛాన్స్ ఉన్నా.. ఇంకా ఆ విషయంలో క్లారిటీ రాలేదు. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు.. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలైయ్యాయి. హారిక హాసికి క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది.