VSP: అచ్చియమ్మపేట మసీదులో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొని ముస్లింలకు ఈద్ ముబారక్ తెలిపారు. రంజాన్ పవిత్రత దాతృత్వం, క్రమశిక్షణ, ధార్మిక చింతనలోనే ఉందని పేర్కొన్నారు. పేదవారికి సాయం చేయడం అల్లా చూపిన మార్గమని, సమాజంలో శాంతి, సామరస్యాలు నెలకొల్పాలని ఆకాంక్షించారు.