SRCL: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని మల్టీ జోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి శనివారం దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వ విప్, వేములవాడ శాసన సభ్యుడు ఆది శ్రీనివాస్ ఆయనను కలిసి రాజన్న ఆలయ అభివృద్ధి, అలాగే జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై భీమేశ్వర సదనంలోని వసతి గృహంలో చర్చించారు.