MBNR: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ (BSC, BZC, BA) 2, 4, 6 సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్ష ఫీజు చెల్లింపునకు ఈనెల 28 తో గడువు ముగియనుంది. విద్యార్థులు సకాలంలో కాలేజీ వెబ్ సైట్లలో ఫీజు చెల్లించి పత్రాలు సమర్పించాలని అధికారులు సూచించారు. రూ.300 అపరాధ రుసుముతో ఈనెల 30 వరకు అవకాశం ఉందన్నారు.