ASR: డుంబ్రిగూడ మండల కేంద్రంలోని గుంటసీమ రోడ్డుపై ఓ ద్విచక్ర వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా, అప్పటికే వాహనం పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.