NLG: దేవరకొండ మండలం జిల్లేపల్లికి చెందిన బీఆర్ఎస్ నాయకులు శనివారం ఎమ్మెల్యే బాలునాయక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రజా ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల వారు కాంగ్రెస్లో చేరడం శుభసూచకమని పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిలో సుధాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.