ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వడానికి వైఎస్ జగన్ చాలానే కష్టపడ్డారు. ఓ వైపు అక్రమాస్తుల కేసులో కోర్టుకు వెళ్లాల్సి వచ్చినా రాష్ట్రమంతా పాదయాత్ర చేశాడు. ఆ పాదయాత్రలో ప్రజల మంచి, చెడులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆ పాదయాత్ర చేయడం.. జగన్ కి ఒక విధంగా కలిసొచ్చిందనే చెప్పాలి. మరో విషయం ఏమిటంటే.. మన తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేసిన ప్రతి ఒక్క నేత ఆ తర్వాత… ముఖ్యమంత్రి అయ్యారు. ఈ సెంటిమెంట్ అప్పట్లో చంద్రబాబు, వైఎస్ఆర్, ఇప్పుడు జగన్ విషయంలో నిజమైంది.
అయితే… ఇప్పుడు మళ్లీ పాదయాత్ర చేద్దామంటే చంద్రబాబు వయసు అవ్వడం వల్ల ఆ సాహసం చేయలేరు. అందుకే వచ్చే ఎన్నికల్లో టీడీపీ ని గెలిపించేందుకు.. ఈసారి లోకేష్ పాదయాత్ర చేయాలని అనుకుంటున్నరాట. జగన్ లాగే తాను కూడా తమ పార్టీ గెలిపించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారట. అయితే.. లోకేష్ నిర్ణయాన్ని సొంత పార్టీ నేతలే హర్షించకపోవడం గమనార్హం.
లోకేశ్ రాజకీయాలలో సత్తా చాటాలని భావిస్తున్నప్పటికీ ఆయనకు పరిస్థితులు అనుకూలించడం లేదు. గతంలో లోకేశ్ పలు సందర్భాల్లో పబ్లిక్ లో చేసిన కామెంట్లు పార్టీకి మైనస్ అయ్యాయనే సంగతి తెలిసిందే. లోకేశ్ ను ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితులు కనిపించడం లేదు.
2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయానికి లోకేశ్ కూడా ఒక కారణమని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. లోకేశ్ పాదయాత్ర దిశగా అడుగులు వేస్తుండగా టీడీపీ నేతలు, కార్యకర్తలు మాత్రం లోకేశ్ ను పాదయాత్ర చేయవద్దని సూచించాలని అచ్చెన్నాయుడు, మరి కొందరు నేతలకు చెబుతున్నారని సమాచారం అందుతోంది. లోకేశ్ జనంలోకి వెళ్లిన తర్వాత ఇష్టానుసారం మాట్లాడితే పార్టీకి నష్టమని కామెంట్లు వినిపిస్తున్నాయి.
లోకేశ్ టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటే మంచిదని మరి కొందరు చెబుతున్నారు. 2024 ఎన్నికలకు ముందు లోకేశ్ పాదయాత్ర చేయడం వల్ల పార్టీకి లాభం కంటే నష్టం ఎక్కువని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అచ్చెన్నాయుడు మాత్రం మంచో చెడో లోకేశ్ వెంటే ముందుకు వెళ్లాలని చెప్పారని బోగట్టా. కొడుకును నాయకుడిగా చూడాలని చంద్రబాబు ఆశపడుతుండగా ఆయన కల ఎప్పటికి నెరవేరుతుందో చూడాల్సి ఉంది.