NTR: నందిగామ అశోక్‌నగర్ ఈద్గా ప్రాంగణంలో ఈద్-ఉల్-ఫితర్ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక నమాజ్ చేశారు. ప్రార్థనల అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఈద్గా వద్దకు చేరుకుని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.