ATP: పుట్లూరు(మం) ఎల్లుట్లలో అకాల వర్షం, గాలివానకు దెబ్బతిన్న అరటి తోటలను YCP మండల కన్వీనర్ మహేశ్వర్ రెడ్డి శనివారం పరిశీలించారు. పంట కోత దశలో నేలపాలు కావడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారని తెలిపారు. బాధితులకు ధైర్యం చెప్పిన మహేశ్వర్ రెడ్డి, పంట నష్టం వివరాలను ప్రభుత్వం దృష్టికితీసుకెళ్లి పరిహారం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.