NZB: ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం కార్పొరేషన్లకు రూ.754 కోట్ల కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిజామాబాద్ కార్పొరేషన్లో గత 14 ఏళ్లుగా నత్త నడకన కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ(UGD) పనులు పూర్తవుతాయా? లేదా అని ప్రజలు భావిస్తున్నారు. 2007లో రూ.94 కోట్ల అంచనా వ్యయంతో 2008 మార్చి 24న కాంట్రాక్టర్కు పనులు అప్పగించగా ప్రస్తుతం రూ.246 కోట్లకు పెరిగింది.