HYD: అంబర్పేట్లో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే వెంకటేశ్ ఆయా ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షను ముగించుకుని వేడుకలు జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు.