NZB: ధర్పల్లి మండలం రేకులపల్లిలో శనివారం తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన 9 ఇళ్లను లక్ష్యంగా చేసుకుని, 2 కిరాణా షాపులతో పాటు 4 ఇళ్లలో నగదు, బంగారం, వెండి ఎత్తుకెళ్లారు. బాధితుడు రాజన్న ఇంట్లో 2 తులాల బంగారం, రూ.10 వేల నగదు చోరీకి గురయ్యాయి. ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.