SRPT: సత్యం, ధర్మం, పవిత్ర ఆలోచనల సమాహారమే రంజాన్ అని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ కుసుమ వెంకట్ రత్నం బాబు అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని సాలార్జంగ్ పేట ఈద్గాలో రంజాన్ పర్వ దినం ప్రార్థనల అనంతరం మున్సిపల్ వైస్ ఛైర్మన్ కౌన్సిలర్లతో కలిసి ముస్లింలకు ఈద్ ముబారక్ తెలిపి మాట్లాడారు. పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరించిన నెల రంజాన్ అని ఆమె అన్నారు.