MMCL: సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం మితిమీరిపోయిందని AITUC రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య మండిపడ్డారు. శనివారం బెల్లంపల్లి ఖైరీగూడా OCP లో నిర్వహించిన ‘సేవ్ సింగరేణి జాతా’లో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం లాగే ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే ధోరణి కొనసాగించడం శోచనీయమన్నారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం AITUC ఎల్లప్పుడూ పోరాడుతుందన్నారు.