TG: పార్టీ మారుతానన్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డితో మంత్రుల సమావేశం ముగిసింది. పార్టీలో గౌరవం డక్కడం లేదని మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ ఎదుట ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడారు. తన నిర్ణయంలో మార్పు లేదని, పూర్తి వివరాలు రేపు వెల్లడిస్తానని తెలిపారు. జీవన్ రెడ్డి ఆవేదనను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.