NZB: భీంగల్ మండలం బాబానగర్‌లో రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలకు ఎంపీడీవో సురేష్ కుమార్ శనివారం నీరు పట్టారు. వేసవిలో మొక్కలు ఎండిపోకుండా నర్సరీలలో ప్రత్యేక సంరక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మొక్కను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీరాం సుమలత, సెక్రటరీ రమ్య తదితరులు పాల్గొన్నారు.