కోనసీమ: మండపేట మండలం ద్వారపూడిలో ఘనంగా రంజాన్ పండుగ శనివారం నిర్వహించారు. ఈదుల్ ఫితర్ ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మస్జిద్ ఇమామ్ కరిముల్లా ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. మానవాళికి శుభ సందేశం అందజేసేందుకు మహనీయ మహ్మద్ ప్రవక్త దివ్య ఖురాన్ ను అవతరింపజేశారని పేర్కొన్నారు. అనంతరం ఒకరికికొరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.