NRML: కుబీర్ మండలం చోండి గ్రామంలో శనివారం సర్పంచ్ సూర్యబాన్ క్రాంతి పశువుల రక్షణ కోసం గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ప్రారంభించారు. పశువులు వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు రైతులు తప్పనిసరిగా టీకాలు చేయించుకోవాలని సర్పంచ్ సూచించారు. పశువైద్యాధికారి ఆధ్వర్యంలో సుమారు 100 పశువులకు టీకాలు వేశారు. ఈ అవకాశం ద్వారా పశువులను ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నారు.