»Tamil Nadu Cm Mk Stalin Daughter Senthamarai Stalin Visited Sattainathar Temple
CM Stalin’s Daughter: ఆలయంలో సీఎం కుమార్తె పూజలు..నెటిజన్ల కామెంట్స్
తమిళనాడు సీఎం కుమార్తె సెంథామరై స్టాలిన్ సిర్కాజి సత్తైనాథర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కుమారుడు సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు గుర్తు చేస్తు ట్రోల్ చేస్తున్నారు. ఇది సనాతన ధర్మం(sanatana dharma) కాదా అని నిలదీస్తున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమార్తె సెంథామరై స్టాలిన్(Senthamarai Stalin) మైలదుత్తురై జిల్లా సిర్కాజిలోని సత్తైనాథర్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం సెంటామరై గోయువులోకి వెళ్లి, స్వామి అంబాల్ చట్టినాధర్, అష్ట భైరవ ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శివాచార్యులు ఆలయ ప్రసాదాలు అందజేశారు. ఈ నేపథ్యంలో ఇటివల స్టాలిన్ కుమారుడు, డీఎంకే మంత్రి ఉదయనిధి సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. ఇది సనాతన ధర్మం కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు? ఇంకొంత మంది పలు రకాలుగా కామెంట్లు చేస్తు ట్రోల్ చేస్తున్నారు.
#WATCH | Tamil Nadu CM MK Stalin’s daughter Senthamarai Stalin visited and offered prayers at Sattainathar Temple in Sirkazhi, Mayiladuthurai district. (01.10) pic.twitter.com/DBNHRDvGSo
చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో గతంలో ఉదయనిధి(udhayanidhi) సనాతన ధర్మాన్ని “మలేరియా, డెంగ్యూ, కరోనా” వంటి వ్యాధులతో పోల్చాడు. అంతేకాదు సనాతన ధర్మం(sanatana dharmam) ఉండకూడదని అన్నారు. వ్యతిరేకించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ తర్వాత తన వ్యాఖ్యలను ఉదయనిధి పదే పదే సమర్థించుకున్నారు. తాను సనాతన ధర్మం కారణంగా బాధపడుతున్న అణగారిన, అట్టడుగున ఉన్న వారి తరపున మాట్లాడానని చెప్పారు.
ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగింది. అనేక మంది ఉదయనిధి వ్యాఖ్యలను ఖండించారు. అంతేకాదు “తన తల్లిని గుడికి వెళ్లకుండా ఆపాలని ఉదయనిధి స్టాలిన్‌కు తను సవాలు చేస్తున్నానని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అన్నారు. ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ కూడా దేవుణ్ణి ఎక్కువగా నమ్ముతారని తేలింది. మరోవైపు నాస్తికత్వం గురించి మాట్లాడుతున్నప్పటికీ, వారి వ్యక్తిగత, ఇతరుల విశ్వాసాలలో జోక్యం చేసుకోనని, పెరియార్ మార్గంలో దేవుడి నిరాకరణ గురించి ఎందుకు మాట్లాడతామో స్టాలిన్ పలుమార్లు ప్రస్తావించారు.