»Two Doctors Save Baby Life On Indigo Ranchi Delhi Flight
Doctors save: గాలిలోనే చిన్నారి ప్రాణం కాపాడిన వైద్యులు!
ఓ చిన్నారి పట్ల ఇద్దరు వైద్యులు ప్రాణదాతలుగా మారారు. విమానంలో ప్రయాణిస్తుండగానే అస్వస్థతకు గురైన ఆరు నెలల చిన్నారిని ఇద్దరు వైద్యులు వెంటనే స్పందించి ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన వివరాలు ఇప్పుడు చుద్దాం.
Two doctors save baby life on Indigo Ranchi-Delhi flight
శనివారం రాంచీ-ఢిల్లీ(Ranchi-Delhi) ఇండిగో విమానం(flight)లో ఇద్దరు వైద్యులు 6 నెలల చిన్నారికి దేవదూతలుగా వచ్చి ప్రాణం పోశారు. ఓ చిన్నారి పుట్టినప్పటి నుంచి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతోంది. ఆ చిన్నారికి చికిత్స అందించడానికి తన పేరెంట్స్ ఢిల్లీ తీసుకువెళ్తున్నారు. ఎయిమ్స్ లో చికిత్స అందించాలని వారు అనుకున్నారు. ఇంతలో విమానంలో ప్రయాణిస్తున్న సమయంలోనే చిన్నారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది. దీంతో చిన్నారి పరిస్థితి చూసి తల్లి తల్లడిల్లిపోయింది. గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. దీంతో విమానం టేకాఫ్ అయిన ఇరవై నిమిషాల తర్వాత, సిబ్బంది ఒక ప్రకటన చేశారు. చిన్నారికి సహాయం చేయాలని అభ్యర్థించారు.
ఆ క్రమంలో అదే విమానంలో రాంచీకి చెందిన ఐఏఎస్ అధికారి డాక్టర్ నితిన్ కులకర్ణి, డాక్టర్ మొజమ్మిల్ ఫిరోజ్ కూడా ప్రయాణించారు. కులకర్ణి ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్కు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అతనికి వైద్య అనుభవం కూడా ఉంది. డాక్టర్ మొజమ్మిల్ ఫిరోజ్ సదర్ హాస్పిటల్, రాంచీలో ఉన్నారు. చిన్నారి తల్లి ఏడుస్తుండటం గమనించిన డాక్టర్ కులకర్ణి, డాక్టర్ మొజమిల్ స్పందించారు. వెంటనే చిన్నారికి వైద్యం అందించారు. సంబంధిత ఇంజెక్షన్ ఇచ్చి చిన్నారికి ప్రాణవాయువు అందించారు. పిల్లవాడు పుట్టుకతో వచ్చే గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. ఇంజెక్షన్, ఆక్సిజన్ తీసుకున్న తర్వాత చిన్నారి పరిస్థితిలో కొంత ఊరట కనిపించింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు, విమానయాన సిబ్బంది, ప్రయాణికులు(passengers) అంతా ఊపిరిపీల్చుకున్నారు.