మేషం
వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి చెందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధు, మిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు.
వృషభం
కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. ప్రయత్నకార్యాల్లో విజయం సాధిస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు.అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. క్రీడాకారులు, రాజకీయరంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు.
మిథునం
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ పరస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగరంగాల్లో సహనంవహించక తప్పదు.గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి
కర్కాటకం
కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి.సమాజంలో గొప్ప పేరు ప్రతిష్ఠలను సంపాదిస్తారు. ఆత్మీయులతో కలిసి మరువలేని మధుర క్షణాలను గడుపుతారు.
సింహం
నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి.వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. . ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. చెడు సహవాసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి.బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు.
కన్య
వృత్తి ఉద్యోగ వ్యాపారాలలోఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ప్రయత్నకార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి.ఎవరితోనూ వాదోపవాదాలు చేయరాదు.కీలక వ్యవహారాల్లో సమాచారలోపం లేకుండా చూసుకోవాలి.
తుల
కొత్త వ్యక్తులు పరిచయమై నూతన పనులకు శ్రీకారం చుడతారు.ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్తపడటం మంచిది. మనస్తాపానికి గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం.మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి.
వృశ్చికం
మిత్రులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు.ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి మొదలుపెట్టాలి.కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తిచేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది.ఉత్సాహంగా పనిచేస్తారు.బంధువుల సహకారం లభిస్తుంది.
ధనుస్సు
వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో లాభాలు పొందుతారు. గౌరవ మర్యాదలకు లోపముండదు. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడుపవలసి వస్తుంది.పట్టుదలతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు.
మకరం
సంతానం నూతన ఉద్యోగవకాశలు పొందుతారు.కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసిక ఆందోళనను తొలగించడానికి దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడుతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువవుతాయి. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. .
కుంభం
వివాదలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు. నూతనకార్యాలను ప్రారంభిస్తారు.మానసిక ఆనందం పొందుతారు.శుభకాలం. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి.
మీనం
పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. ఏ విషయంలోనూ స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు.తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా, గౌరవ మర్యాదలకు భంగంవాటిల్లకుండా జాగ్రత్త పడటం మంచిది.