టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. 2007 టీ20 ప్రపంచ కప్‌లో భారత ఆల్ రౌండర్ యువరాజ్‌సింగ్ , ఇంగ్లాండ్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ (Stuart Broad) మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. దీంతో కోపోద్రిక్తుడైన యువీ.. బ్రాడ్ వేసిన తర్వాతి ఓవర్లో ఆరు బంతులకు ఆరు సిక్సులు కొట్టి టీమిండియా గెలుపును మరింత సులువు చేశారు. దీనిని ట్విట్టర్ (Twitter) వేదికగా గుర్తుచేసిన రేవంత్.. ఆ ఆరు సిక్సులు భారత జట్టు గెలుపునకు ఎంత కృషి చేశాయో.. టీ.కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు కూడా వచ్చే ఎన్నికల్లో అంతే ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. దీనికి యువీ కొట్టే ఒక్కో సిక్సర్ సందర్భంగా ఒక్కో గ్యారంటీ స్కీమ్ (Guarantee Scheme) గురించి వివరించే వీడియోను జోడించారు.
టీమిండియా మాదిరి కాంగ్రెస్ (Congress) గెలుపు ఇన్నింగ్స్ కోసం వెయిట్ చేయండి అంటూ ట్వీట్టర్ వేదికగా తెలిపారు.ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుస చేరికలతో బీఆర్ఎస్ (BRS) కు తామే ప్రత్యామ్నాయం చెప్పడంతో పాటు అధికారం కూడా తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80 నుంచి 90 సీట్లు గెలుచుకోబోతోందని స్వయంగా రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా ట్వీట్టర్లో ట్వీట్ పెట్టారు.మహాలక్ష్మీ (Mahalakshmi) పథకంలో భాగంగా మహిళలకు ప్రతి నెలా 2000 రూపాయలు ఆర్ధిక సహాయం అందించనున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రయాణం ఉచితం కానుంది. ఇక అన్నింటికంటే ముఖ్యంగా గ్యాస్ సిలెండర్ ధర 500 రూపాయలకే ఇవ్వనుంది.
చేయూత పథకంలో భాగంగా నెలకు 4000 రూపాయల పెన్షన్, 10 లక్షల వరకూ రాజీవ్ ఆరోగ్య శ్రీ (Arogya Shri)భీమా అమలు చేయనున్నారు. గృహలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకూ విద్యుత్ ఉచితంగా అందించనుంది ప్రభుత్వం. యువ వికాసంలో భాగంగా విద్యార్ధులకు 5 లక్షల రూపాయలు విద్యా భరోసా కార్డు అందించనున్నారు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మాణముంటుంది. ఇందిరమ్మ ఇళ్లు (Indiramma houses) పథకంలో భాగంగా ఇళ్లు లేనివారికి ఇంటి స్థలంలో నిర్మాణానికి 5 లక్షల రూపాయలు సహాయం అందించనున్నారు. ఉద్యమకారుల కుటుంబాలకు 250 చదరపు గజాల స్థలం కేటాయించనున్నారు. రైతు భరోసాలో భాగంగా రైతులు, కౌలు రైతులకు ఏటా 15000 రూపాయలు ఆర్ధిక సహాయం ఉంటుంది. వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12000 ఆర్ధిక సహాయం అందుతుంది. వరి పంటకు క్వింటాల్‌కు 500 రూపాయలు బోనస్ లభిస్తుంది.
Hey Telangana, it's not just cricket where sixers matter! Congress is hitting the political pitch with 6 game-changing promises. Get ready for a winning inning! ⁰⁰#Congress6TelanganaVictoryFixhttps://t.co/ixRABjxUQe