విశాఖ(Visakha)కు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తరలించడంపై తాజాగా కొత్త అంశం తెరపైకి వచ్చింది. దసరా నాటికి వైజాగ్‌కు వెళ్లేందుకు సీఎం జగన్ (CMJAGAN) సూత్రప్రాయంగా ఒకే చేశారంటున్నారు.ఇందులో భాగంగానే దసరా (Dussehra) ముందు రోజు అక్టోబరు 23న విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం పూజకు ముహూర్తం బాగుంటుందనే ప్రతిపాదన వచ్చినట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో కచ్చితమైన నిర్ణయమేదీ తీసుకోలేదని స్పష్టం చేశాయి. విశాఖలో ఏర్పాట్లు ఓ కొలిక్కి రావడంపై సీఎం షెడ్యూల్ ఆధారపడి ఉంటుందని తెలిపాయి. అక్టోబర్ మొదటి వారంలో ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
విశాఖలో ఏర్పాట్లు ఓ కొలిక్కి రావడంపై సీఎం షెడ్యూల్ ఆధారపడి ఉంటుందని టాక్ వస్తోంది. అక్టోబర్ మొదటి వారంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం వుంది. ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా ఉన్న అమరావతి(Amaravati)ని కాదని మూడు రాజధానుల బిల్లును తీసుకువచ్చి విరమించుకుంది. పరిపాలన రాజధానిగా విశాఖ(Visaka Capital) , న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి(Amaravati) ఉంటుందని అసెంబ్లీలో బిల్లును వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టి హైకోర్టు నుంచి అభ్యంతరం రావడంతో బిల్లును విరమించుకుంది. ఆ తరువాత ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఏపీకి ఒకే ఒక రాజధాని అమరావతిని కొనసాగించాలంటూ దాదాపు నాలుగు సంవత్సరాలుగా అమరావతి రైతులతో పాటు అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే .