విశాఖ (Visakha) ఎన్ఏడీ జంక్షన్ వద్ద హవాల డబ్బును ఎయిర్పోర్టు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాషింగ్ మెషిన్లో1.30 కోట్లు నగదు ఉంచి ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్నారు. ఆటోలో 6 వాషింగ్ మెషీన్(Washing machine)లో నగదుతో పాటు 30 సెలిఫోన్లను గుర్తించారు. వాషింగ్ మెషీన్లతో ఓ సుజుకీ వాహనం వెళ్తుంది. దాని వెనుక ఒక యువకుడు ఫైలెట్గా బైక్పై వెళ్తున్నాడు. ఆటోలో మరో యువకుడు సైతం ఉన్నారు. వీరిపై పోలీసుల(Police)కు అనుమానం వచ్చింది. వాహనం ఆపి ఆరా తియ్యగా వాషింగ్ మెషీన్లను విజయవాడ తరలిస్తున్నట్లు వెల్లడించారు. దాంతో పోలీసుల అనుమానం మరింత రెట్టింపైంది.
విశాఖ పట్నం నుంచి పరిసర ప్రాంతాల్లోకి వాషింగ్ మెషీన్లు తరలిస్తే ఒకే కానీ ఇక్కడ నుంచి విజయవాడకు తరలించడం ఏంటని ప్రశ్నించారు. అనుమానంతో వాషింగ్ మెషీన్లు తనిఖీ చేయగా పోలీసుల ఆశ్చర్యపోయేలా నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. వాషింగ్ మెషిన్లను విజయవాడ(Vijayawada)కు తరలిస్తున్నట్లు ఆటో డ్రైవర్ వెల్లడించాడు. అయితే, నోట్ల కట్టలు ఎవరివనే విషయం కానీ, నగదుకు సంబంధించిన ఇతరత్రా ఆధారాలు కానీ చూపించలేదు. దీంతో నగదుతో పాటు మొబైల్ ఫోన్ల(Mobile phones)ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆటో(Auto)ను సీజ్ చేసి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మిగతా వివరాలను పోలీసులు వెల్లడించలేదు. నగరంలోని ఓ ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ నుంచి ఈ నోట్ల కట్టలను తరలిస్తున్నట్లు సమాచారం.దీంతో పోలీసులు వాహనాన్ని, డబ్బు, మెుబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.