ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ (ODI World Cup) ప్రారంభానికి ముందు..న్యూజిలాండ్ అదరిపోయే ఆటతీరు ప్రదర్శించింది. ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన పోరులో కివీస్ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్ (Pakistan) ను చిత్తుచేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ (94 బంతుల్లో 103 రిటైర్డ్ హర్ట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కగా.. కెప్టెన్ బాబర్ ఆజమ్ (Babar Azam) (80; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), సౌద్ షకీల్ (53 బంతుల్లో 75; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకాలతో సత్తాచాటారు.అనంతరం లక్ష్యఛేదనలో కివీస్ కేవలం 43.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 346 పరుగులు చేసి విజయఢంకా మోగించింది.
చదవండి : Horoscope today: నేటి రాశి ఫలాలు(September 30th 2023)
న్యూజిలాండ్ (New Zealand) బౌలర్లలో మిషెల్ శాంట్నర్ 2, మ్యాట్ హెన్రీ, ఫెర్గూసన్, నీషమ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష ఛేదనలో కివీస్ 43.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (72 బంతుల్లో 97; 16 ఫోర్లు, ఒక సిక్సర్) ఎడాపెడా బౌండ్రీలతో విరుచుకుపడగా.. కేన్ విలియమ్సన్ (Williamson) (54; 8 ఫోర్లు), డారిల్ మిషెల్ (59; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్క్ చాప్ మన్ (41 బంతుల్లో 65 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. పాకిస్థాన్ బౌలర్లలో ఉసామా మిర్ 2, హసన్ అలీ, సల్మాన్, వసీమ్ తలా ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నారు. ఈ మ్యాచ్ కు భద్రత కల్పించలేం అని పోలీసులు ముందే తెలపడంతో.. స్టేడియంలోనికి అభిమానులను అనుమతించలేదు. వార్మప్ మ్యాచ్ (Warm up match) ల్లో భాగంగా శనివారం గువాహటి వేదికగా.. ఇంగ్లండ్ తో భారత్ తలపడనుంది. ఇక మంగళవారం ఉప్పల్ లో జరుగనున్న వార్మప్ మ్యాచ్లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
చదవండి : Jamili elections : 2024లో జమిలి ఎన్నికలు నిర్వహణ కష్టం : లా కమిషన్?
Tags :