JGL: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో జనాకర్షణ పథకాలకు తప్ప విద్యారంగానికి కేటాయింపులు లేవని స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా నాయకులు బైరం హరి కిరణ్, పాలెపు శివరామకృష్ణ అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌పై శుక్రవారం సమావేశం నిర్వహించారు. విద్యావ్యవస్థకు 15% కేటాయిస్తామని చెప్పి 8.22% మాత్రమే కేటాయించారని అన్నారు.