Skanda: ‘స్కంద’ షాక్.. రామ్ అన్ని కిలోల బరువు పెరిగాడా?
ప్రస్తుతం సోషల్ మీడియాలో రామ్ పోతినేని పిక్ ఒకటి తెగ వైరల్ అవుతోంది. స్కంద సినిమా కోసం రామ్ మేకోవర్ చూస్తే.. వావ్ అనాల్సిందే. ఈ సినిమా కోసం రామ్ భారీగా బరువు పెరిగాడు. అయితే రామ్ ఎన్ని కిలోల బరువు పెరిగాడు? అనేదే ఇప్పుడు వైరల్‌గా మారింది.
బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబినేషన్లో వస్తున్న స్కంద సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇంకొన్ని గంటల్లో స్కంద థియేటర్లోకి రానుంది. బోయపాటి మార్క్ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్‌తో స్కంద రాబోతోంది. అయితే ఈ సినిమాలో రామ్ కాస్త చబ్బీగా కనిపించి షాక్ ఇచ్చాడు. బోయపాటి అంటే యాక్షన్స్ సీక్వెన్స్ ఓ రేంజ్లో ఉంటుంది. అలాంటప్పుడు రామ్ స్మార్ట్‌గా కనిపిస్తే కుదరదు. అందుకే కాస్త బరువు పెరిగాడు రామ్. అందుకోసం రామ్ చాలా కష్టపడ్డాడు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ చూస్తే రామ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉందో చెప్పొచ్చు.
ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం రామ్ ఏకంగా 12కిలోల బరువు పెరిగాడట. బాడీ షేప్ పర్ఫెక్ట్గా రావడానికి జిమ్‌లో తెగ కసరత్తులు చేశాడట. ప్రస్తుతం రామ్ షర్ట్ లెస్ ఫోటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక అఖండ వంటి హిట్ తర్వాత బోయపాటి చేస్తున్న సినిమా కావడంతో.. ఖచ్చితంగా ఈ సినిమా రామ్ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టే ఛాన్స్ ఉంది.
యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో.. సాయి మంజ్రేకర్ మరో కీలక పాత్రలో నటించింది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించాడు. రామ్, బోయపాటి చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇదే. కాబట్టి.. స్కంద థియేటర్లో పాన్ ఇండియా మాస్ జాతర చేయిస్తుందని అంటున్నారు. మరి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన స్కంద ఎలా ఉంటుందో చూడాలి.