United States : ఘోరం..6 నెలల చిన్నారిని తినేసిన ఎలుకలు!
ఓ 6 నెలల చిన్నారిని ఎలుకలు కొరికి తినేశాయి. తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్లే ఈ దారుణం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు.
ఆరు నెలల చిన్నారిని ఎలుకలు ఘోరంగా కొరికి చంపేశాయి. 50 కంటే ఎక్కువసార్లు కరవడంతో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడి మరణించింది. ఈ దారుణ ఘటన యునైటెడ్ స్టేట్స్లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశారు. చిన్నారి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు.
యూఎస్ లోని ఇండియానా ప్రాంతంలో 6 నెలల పసికందును ఎలుకలు కొరికి తినేసిన సంఘటన కలకలం రేపింది. ఆ చిన్నారి తండ్రి ఇవాన్స్ విల్లేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆ చిన్నారి చనిపోయినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఆ చిన్నారి తల్లిదండ్రులు డేవిడ్, ఏంజెల్ స్కోనాబామ్, అత్త డెలానియా థుర్మాన్ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
తల్లిదండ్రులు తమ ఇంటికి వెళ్లేసరికి ఇల్లంతా రక్తపు మరకలతో ఉందని తల్లిదండ్రులు తెలిపారు. వారికి ఇది వరకూ ముగ్గురు పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల ఆ పిల్లల్ని కూడా వారి రక్షణ నుంచి తొలగించారు. గతంలో కూడా చిన్నారులను ఆ ఎలుకలు రెండు మూడు సార్లు కొరికాయి. అయినప్పటికీ ఆ తల్లిదండ్రులు ఏ చర్యలు తీసుకోలేదు. పిల్లల్ని పట్టించుకోలేదు. దీంతో పోలీసులు వారిని, ఆ ఇంటి పనిమనిషిని అరెస్ట్ చేశారు.