KDP: పులివెందులలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణంలో ఉన్న చీనీకాయల మార్కెట్ వెలవెలబోతోంది. సాధారణంగా వేసవికాలంలో చీనీ కాయలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. చీని ధరలు తగ్గడంతో కాయలను రైతులు మార్కెట్కు తీసుకురావడంలేదని పలువురు ఆరోపించారు. ప్రస్తుతం టన్ను చీనీ కాయల ధర రూ.14 వేలు ఉండడంతో రైతులు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.