HYD: సాధారణంగా ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాక సెలవులు ఎంజాయ్ చేయాలని చాలామంది భావిస్తారు. కానీ..హైదరాబాద్లో ఓ ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి మాత్రం భిన్నంగా ఆలోచించాడు. మూడు నెలల ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా, కుటుంబ ఖర్చులు, కాలేజీ ఫీజులకు తోడ్పడేందుకు కష్టపడుతున్నాడు. చెమటోడుస్తూ పని చేస్తున్న అతడిని చూసిన వారు అతని పట్టుదల పై ప్రశంసలు కురిపిస్తున్నారు.