»Cobra Commandos Cobra Unit Entering Jammu And Kashmir For The First Time
COBRA Commandos: జమ్మూకశ్మీర్‌లో తొలిసారి అడుగుపెడుతోన్న కోబ్రా యూనిట్..ప్రత్యేకతలివే
జమ్మూకశ్మీర్ ప్రాంతంలో మొదటిసారి కోబ్రా యూనిట్ అడుగుపెట్టబోతోంది. కోబ్రా యూనిట్ అనేది సీఆర్పీఎఫ్ లోనే అత్యున్నత దళం. ఈ యూనిట్లో మానసికంగా, శారీరకంగా కఠిన శిక్షణ తీసుకున్న సైనికులు ఉంటారు.
జమ్మూకశ్మీర్ పరిస్థితులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సీఆర్పీఎఫ్ అత్యున్నత దళమైన కోబ్రా యూనిట్‌ను రంగంలోకి దింపేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఉగ్రవాదంపై పోరాడటంలో ఈ కోబ్రా యూనిట్‌కు అపార అనుభవం ఉంది. గతంలో కూడా ఈ కోబ్రా యూనిట్ దళం బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో పనిచేసింది. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ లోని కుప్వాపాలో ఈ యూనిట్ ఉంది.
ఏప్రిల్ నెలలో ఈ దళం శిక్షణ కోసం ఇక్కడికి చేరుకుంది. అప్పటి నుంచి వీరికి ఏ బాధ్యతలు అప్పగించలేదు. అడవుల్లోని గెరిల్లా యుద్ధతంత్రం కోసం ఈ కోబ్రా (ది కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్) దళాన్ని కేంద్రం రూపొందించింది. ఈ సైనికులు అడవుల్లో పోరాడటంలో ప్రత్యేక అనుభవాన్ని పొందారు. ఈ దళ సభ్యులను శిక్షణ సమయంలో మానసికంగా, శారీరకంగా అత్యంత కఠినంగా సిద్ధం చేస్తారు.
నిన్నటి వరకూ జమ్మూకశ్మీర్ లో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. భద్రతా దళాలకు తీవ్ర ప్రాణనష్టం వాటిళ్లింది. ఈ ఘటనపై జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడుతూ.. కచ్చితంగా తాము ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. తమ భద్రతా దళాలపై పూర్తి విశ్వాసం ఉందని, దేశం మొత్తం వారి వెంటే ఉందని మనోజ్ సిన్హా తెలిపారు.