»A Baby Born With 26 Fingers Is Worshiped By The Locals As A Divine Form
26 Fingers: 26 వేళ్లతో జన్మించిన శిశువు.. దైవ స్వరూపమంటూ స్థానికుల పూజలు
26 వేళ్లతో ఓ పాప జన్మించడంతో ఆ గ్రామస్తులంతా దేవతగా భావిస్తున్నారు. ఆ పాపకు పూజలు చేస్తున్నారు. అయితే వైద్యులు మాత్రం ఆ పాప జన్యుపరమైన సమస్యతో జన్మించినట్లు చెప్పారు.
రాజస్థాన్లో ఓ శిశువు 26 వేళ్లతో జన్మించింది. ఈ వింత ఘటన స్థానికంగా కలకలం రేపింది. భరత్పూర్లో 26 వేళ్లతో ఆడపిల్ల జన్మించిందని తెలియడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ శిశువు కుటుంబీకులు దైవ స్వరూపంగా భావిస్తున్నారు. శిశువు ప్రతి చేతిలోనూ ఏడు వేళ్లు, ప్రతి కాలులో ఆరు వేళ్లతో పుట్టింది. శిశువును ఆమె కుటుంబ సభ్యులు డోలాగర్ దేవి, దేవతా అవతారంగా భావించి మొక్కుకున్నారు.
అయితే ఈ సంఘటనపై వైద్యులు వేరే రకంగా స్పందించారు. వైద్యులు దీనిని జన్యు సంబంధిత సమస్యగా భావిస్తున్నారు. 26 వేళ్లు ఉండటం సాధారణమైనప్పటికీ, ఇది చాలా అరుదైన సంఘటనగా అని డాక్టర్లు చెబుతున్నారు. పాప తల్లి సర్జూ దేవి వయసు 25 ఏళ్లు మాత్రమే. ఆమె 8 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ప్రసవ వేదనకు గురైంది.
26 వేళ్లు ఉండటం వల్ల ఏ హానీ ఉండదని, అది జన్యుపరమైన వైపరీత్యమని, ప్రస్తుతం శిశువు పూర్తి ఆరోగ్యంతో ఉందని వైద్యులు తెలిపారు. పాప అలా జన్మించడం ఒక జన్యుపరమైన వైపరీత్యమని డాక్టర్ బిఎస్ సోనీ వెల్లడించారు. గ్రామస్తులు ఆ పాపను ధోలగర్ దేవి అవతారంగా భావిస్తున్నారు. పాప తండ్రి గోపాల్ భట్టాచార్య సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో హెడ్ కానిస్టేబుల్ గా ఉన్నారు. పాప అలా పుట్టడం సంతోషకర విషయమని, గ్రామస్తులంతా పాపను దేవతగా కొలుస్తున్నారని తెలిపారు.