»Telangana Liberation Day Amit Shah Speech Parade Ground Secunderabad
Amit shah: ఈ వేడుకను అప్పుడు మరిచారు..ప్రజలు వారిని క్షమించరు
తెలంగాణ విమోచన దినోత్సవం(telangana liberation day) వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా(amit shah) పాల్గొన్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సహా పలువురు నేతలు హాజరయ్యారు. ఈ క్రమంలో అమిత్ షా ఈ దినోత్సవం గురించి పలు పార్టీలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
telangana liberation day amit shah speech parade ground secunderabad
సికింద్రాబాద్(secunderabad)లోని పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి సహా పలువురు నేతలు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా సాయుధ దళాలు కవాతును చేపట్టాయి. 1948 సెప్టెంబర్ 17న ఆపరేషన్ పోలో చర్య తర్వాత హైదరాబాద్ రాచరిక రాష్ట్రం ఇండియన్ యూనియన్‌లో చేరింది. గతేడాది తొలిసారిగా కేంద్రం అధికారికంగా ఈ వేడుకలకు నిర్వహించింది.
ఈ సందర్భంగా తెలంగాణ విముక్తి పోరాటంలో పాల్గొన్న యోధులకు అమిత్ షా (amit shah) ప్రసంగించి వందనాలు తెలియజేశారు. హైదరాబాద్ ప్రజలకు ఈరోజు నిజాం ప్రభుత్వం నుంచి విముక్తి కల్గిన రోజు అని గుర్తు చేశారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సర్దార్ పటేల్ లేకపోతే తెలంగాణకు అప్పట్లో విముక్తి లభించేది కాదని అమిత్ షా అన్నారు. పటేల్, కేఎం మున్షీ వల్లనే నిజాం పాలన అంతమైందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ చరిత్రను 75 ఏళ్లపాటు వక్రీకరించారని గుర్తు చేశారు. మోడీ ప్రధాని అయ్యాక ఆ పొరపాటును సరిచేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఈ వేడుకలను రాజకీయం చేస్తుందన్నారు.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని(telangana liberation day) అధికారికంగా నిర్వహించడానికి కారణాలు ఉన్నాయని అమిత్ షా అన్నారు. ఈ చరిత్రాత్మకమైన రోజును భవిష్యత్ తరాలకు తెలియజేయడం, ఆ నాటి పోరాట యోధుల సేవలను గుర్తు చేసుకోవడం కోసమే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కానీ కొంత మంది తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఈ వేడుకను మరిచారని అన్నారు. కేవలం ఓటు బ్యాంకు కోసమే మాత్రమే ఈసారి నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ విమోచన దినోత్సవం విషయంలో రాజకీయం చేస్తున్న వారిని ప్రజలు ఎప్పటికీ క్షమించలేరని అమిత్ షా వెల్లడించారు.