TG: మూసీ ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీశ్‌రావు, BRS నేతలు విషం చిమ్ముతున్నారని కాంగ్రెస్ MLC బల్మూరి వెంకట్ విమర్శించారు. మూసీ నదిని ప్రక్షాళన చేయడం వాళ్లకు ఇష్టం లేదన్నారు. మూసీ పరివాహక ప్రాంతం శుభ్రపడితే HYD ప్రజలు ఎప్పటికీ CM రేవంత్‌ను గుర్తుపెట్టుకుంటారనే భయం BRS నేతల్లో ఉందన్నారు.