BRS పార్టీకి ఖమ్మం జిల్లా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు రాజీనామా లేఖను పంపించారు. BRSలో తనకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అయితే ఈరోజు హైదరాబాద్లో జరగనున్న CWC సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. తనపాటు బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి సహా పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరునున్నారని సమాచారం. ఈ కార్యక్రమానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కూడా హాజరుకానున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న తుమ్మలకు ఖమ్మం ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.