మరోసారి ప్రభాస్ ఫ్యాన్స్‌ను టెన్షన్ పెట్టే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్‌కు మళ్లీ సర్జరీ అయినట్టుగా తెలుస్తోంది. ఈరోజే ప్రభాస్‌కు సర్జరీ అని తెలుస్తోంది.
రీసెంట్గా ప్రభాస్ యూరప్ ట్రిప్‌కు వెళ్లినట్లుగా వార్తలు వచ్చాయి. దాదాపు 15 రోజుల తర్వాత తిగిరి హైదరాబాద్‌కు రానున్నారని.. ఈ లోపు కల్కి, మారుతి సినిమాల్లో హీరో అవసరం లేని సన్నివేశాల చిత్రీకరించనున్నారని టాక్ నడిచింది. దాదాపు రెండు నెలల పాటు డార్లింగ్ విదేశాల్లోనే ఉంటారని.. ఆ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చి, కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటారని ప్రచారం జరిగింది. మొత్తంగా వచ్చే 3 నెలల పాటు ప్రభాస్ సినిమాలకు దూరంగా ఉంటారని.. తిరిగి 2024లో సినిమా సెట్స్ లోకి అడుగు పెట్టనున్నట్లు వార్తలొచ్చాయి.
కానీ ప్రభాస్ విదేశీ పర్యటనకు సర్జరీ కోసమే వెళ్లినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఇప్పుడు ప్రభాస్ మోకాలి సర్జరీ పూర్తైనట్టుగా తెలుస్తోంది. ఈరోజే ప్రభాస్ మోకాలీ సర్జరీ అని సోషల్ మీడియాలో ఓ న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. సలార్ సినిమా షూటింగ్లో జరిగిన చిన్న యాక్సిడెంట్ వల్ల ప్రభాస్ కాలికి గాయమైందని అప్పట్లో టాక్ రాగా.. ఇప్పుడు పూర్తి స్థాయిలో మోకాలి సర్జరీ జరిగిందని సమాచారం. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. ప్రభాస్ హెల్త్ విషయంలో ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు.
ఎలాంటి సమస్య ఉన్నా సరే.. వీలైనంత త్వరగా డార్లింగ్ కోలుకోవాలని అంటున్నారు. ఇకపోతే.. సలార్ సినిమాతో పాటు కల్కి, మారుతి సినిమాలు కూడా ప్రస్తుతం ఫుల్ వర్క్ మోడ్‌లో ఉన్నాయి. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ ‘స్పిరిట్’ సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే హనురాఘవపూడితో లవ్ స్టోరీ చేయడానికి రెడీ అవుతున్నాడు ప్రభాస్. దీంతో పాట మంచు విష్ణు ‘భక్త కన్నప్ప’ చిత్రంలోను శివుడి పాత్రలో కనిపించనున్నాడు ప్రభాస్.