నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉంది. వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతోంది. అన్ని ఇండస్ట్రీలలో సినిమాలు చేస్తోంది. మరి అలాంటి అవకాశాలు రావాలంటే ఎంతో కష్టపడాలి. ఎంత నొప్పి ఉన్న సరే.. తగ్గేదేలే అంటోంది రష్మిక.
Rashmika: హీరోయిన్లు అందంగా కనిపించాలంటే డైట్‌తో పాటు గంటల పాటు జిమ్‌లో కష్టపడాల్సిందే. అలా అయితే పర్ఫెక్ట్ ఫిగర్‌ను మెయింటేన్ చేయగలరు. అలాంటి వారిలో క్యూట్ బ్యూటీ రష్మిక ముందు వరుసలో ఉంటుంది. తన ఫిజిక్ ను ఎప్పటికప్పుడు ఫిట్‌గా ఉంచేందుకు జిమ్‌లో కసరత్తులు చేస్తునే ఉంటుంది. తాజాగా జిమ్‌లో రష్మిక వర్కౌట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో లెగ్స్ వర్కౌట్ చేస్తూ కనిపించింది. హెవీ వెయిట్‌ను కాళ్లతో లిఫ్ట్ చేస్తూ కండరాలను మరింత బలంగా తయారు చేస్తోంది. అయితే ఈ వర్కౌట్‌లో అమ్మడు చాలా నొప్పిని భరిస్తూ కష్ట పడుతున్నట్టుగా ఉంది.
పైగా థైస్ షో మామూలుగా లేదు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అమ్మడి కష్టానికి, అందానికి ఫిదా అవుతున్నారు కుర్రకారు. మామూలుగా రష్మిక ఎప్పుడూ ఫిట్ కనిపించేందుకు వ్యాయామం చేస్తుంటుంది. అలాగే జిమ్‌లో ఉండే వర్కౌట్స్ మామూలే. లేదంటే అమ్మడి గ్లామర్‌తో తేడా వచ్చేస్తుంది మరి. ఇకపోతే రష్మిక మందన్న ప్రస్తుతం తమిళ్, తెలుగు, బాలీవుడ్లో భారీ ప్రాజెక్స్ట్ చేస్తోంది. తెలుగులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన హిట్ సీక్వెల్ ‘పుష్ప’లో నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను సుకుమార్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఏడాది ఆగష్టు 15న పుష్ప2 రిలీజ్ కానుంది. అలాగే బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్ బీర్ కపూర్‌తో ‘యానిమల్’ సినిమాలో రొమాన్స్ చేస్తోంది. ఈ సినిమాను అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలతో పాటు ‘రెయిన్ బో’ అనే లేడీ ఓరియెంటేడ్ సినిమా కూడా చేస్తోంది.