నిజమే.. ఉన్నట్టుండి ఒక్కసారిగా ట్విట్టర్ ట్రెండ్ అవుతోంది పవర్ స్టార్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా జరగడం లేదు. మరెందుకు ట్రెండ్ అవుతోంది?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో ఓజి, ఉస్తాద్ అప్డేట్స్ వస్తున్నాయి కానీ.. హరిహర వీరమల్లు అప్డేట్స్ మాత్రం బయటికి రావడం లేదు. ఓజి, ఉస్తాద్ సినిమాలు.. ఎప్పుడో స్టార్ట్ అయిన హరిహర వీరమల్లును డామినేట్ చేస్తున్నాయి. డైరెక్టర్ క్రిష్ కూడా ఎక్కడా కనిపించడం లేదు. కానీ ఇటీవలె నిర్మాత ఎఎం రత్నం మాత్రం ఎలక్షన్స్ లోపు హరిహరను కంప్లీట్ చేస్తామని చెప్పుకొచ్చాడు. అయినా షూటింగ్ అప్డేట్ మాత్రం ఇవ్వడం లేదు.
దీంతో పవన్ అభిమానులు ఈ సినిమా పై రోజు రోజుకి నమ్మకం కోల్పోతున్నారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియా బజ్ ప్రకారం.. ఈ సినిమాకు సీక్వెల్ కన్ఫామ్ అయిందనే టాక్ తెలుస్తోంది. గతంలోను ఇలాంటి వార్తలు వచ్చాయి. కానీ ఎప్పుడు కూడా ఇంతలా ట్రెండ్ అవలేదు. హరిహర వీరమల్లు రెండు భాగాలుగా రాబోతోంది.. ఆల్మోస్ట్ అఫీషియల్ క్లారిటీ అనుకునేలా ఈ న్యూస్ వైరల్ అవుతోంది.
పవన్ సన్నిహిత వర్గాల ప్రకారం ఈ సినిమా ఒకటి కాదు రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇదే నిజమైతే.. పవన్ చేస్తున్న ఫస్ట్ సీక్వెల్ సినిమా ఇదే కానుంది. అలాగే ఫస్ట్ అనౌన్స్ చేసిన పాన్ ఇండియా ఫిల్మ్ కూడా ఇదే. అయితే.. నెటిజన్స్ మాత్రం ముందు ఒక సినిమాను కంప్లీట్ చేయండి.. ఆ తర్వాత సెకండ్ పార్ట్ గురించి ఆలోచించవచ్చని కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే.. ఏండ్లకేండ్లు గడుస్తున్నాయి కానీ.. హరిహర వీరమల్లు షూటింగ్ మాత్రం కంప్లీట్ అవడం లేదు. కాబట్టి.. ముందు ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయితే సెకండ్ పార్ట్ నిజమేనని నమ్మెచ్చు.