Mukesh Udeshi Died: ప్రముఖ నిర్మాత ముకేశ్ ఉద్దేశి అనారోగ్యంతో కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో గత కొంతకాలం నుంచి ఆయన బాధపడుతున్నారు. చెన్నై ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సర్జరీ చేయించేందుకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో ముకేశ్ ఉద్దేశి చనిపోయారు. మెగాసార్ట్ చిరంజీవి హిందీలో నటించిన ప్రతిబంధ్, ద జెంటిల్ మ్యాన్, ఎస్పీ పరుశురాం, ఊర్మిల నటించిన కౌన్ సినిమాలను ముఖేశ్ నిర్మించారు. గో గోవా డాన్, ద విలన్, ద షౌకీన్స్, బ్రేక్ కే బాద్, సారీ భాయ్ సినిమాలకు లైన్ ప్రొడ్యూసర్గా పనిచేశారు. ముకేశ్ ఉద్దేశికి భార్య, కుమారుడు ఉన్నారు. ముకేశ్ మృతితో సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగి పోయింది.