తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం మేరకు..చిన్నకోడూరు మండలం అనంత సాగర్ శివారులో ఈ ప్రమాదం జరిగింది. రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుంచి క్వాలిస్ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో స్పాట్ లోనే ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. 8 మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి.
క్వాలిస్ వాహనంలో మొత్తం 11 మంది విద్యార్థులు ప్రయాణిస్తుండగా ఈ దారుణం చోటుచేసుకుంది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయాలపాలైన వారు సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స పొందుతున్నారు. మృతిచెందిన వారిని నితిన్, గ్రీష్మ, నమ్రత అనే ముగ్గురు విద్యార్థులు యాక్సిడెంట్ స్పాట్ లోనే మృతిచెందారు.
విద్యార్థులంతా కరీంనగర్ (Karimnagar)లోని తిమ్మాపూర్లో పరీక్షలు రాసి సిద్దిపేటకు తిరిగొస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. వీరంతా సిద్దిపేట ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుకుంటున్నారు. విద్యార్థుల కుటుంబీకులు పోలీసులు సమాచారం అందించారు.