Chandrababu: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పన్నిన ప్రతీకార చర్య అని టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్రంగా విమర్శించారు. జరుగుతున్న సంఘటనలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాలకృష్ణ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన దృష్టిని ప్రజాసేవపై మళ్లించడానికి, బదులుగా ప్రతిపక్ష నాయకులతో స్కోర్ చేయడంపై ఫిక్స్ అయ్యారని ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై బాలకృష్ణ మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
రాజకీయ కక్ష సాధింపులో భాగంగా చంద్రబాబును అరెస్ట్ చేశారని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఇలాంటివి ఎన్నో చూసిందని.. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదని.. తాము న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు లేకుండా.. గంజాయికి బానిసలుగా చేస్తున్నారని విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతో వైసీపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని బాలకృష్ణ ఆరోపించారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోయిన కుట్ర పూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు. జగన్ 16 నెలలు జైలులో ఉన్నారని.. చంద్రబాబును 16 రోజులు జైలులో పెట్టాలని ఈ స్కామ్‌ను క్రియేట్ చేశారని ఆరోపించారు. ఈ కేసులో ప్రేమ్‌చంద్రా రెడ్డి పేరు ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు.
72 వేల మందికి ఉపాధి కల్పించడం జరిగిందని అన్నారు. సీఎం అనే వ్యక్తి పాలసీ మేకర్ మాత్రమేనని అన్నారు. ఇక ముందు చాలా కేసులు పెడతారని అన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా డిజైన్ టెక్ కంపెనీకి అప్రిషియేషన్ లెటర్ ఇచ్చిందని చెప్పారు.