VZM: బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామంలో స్వయంభుగా వెలసిన రాజరాజేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారు మధుర ఫలదాయునిగా భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం పరాభనామ తెలుగు సంవత్సరాది ఉగాది పురస్కరించుకుని ఆలయం అర్చకులు దూసి శ్రీధర్ శర్మ అమ్మవారిని పంచదారచిలకలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.