SRPT: తుంగతుర్తి మండల కేంద్రంలో గత కొంతకాలంగా వీధి దీపాలు వెలగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే కష్టంగా ఉందని గ్రామ ప్రజలు వాపోతున్నారు. నూతన సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యవర్గ సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించి నాలుగు నెలలు కావస్తున్నా వీధి దీపాలు ఏర్పాటు చేసిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.